Viveka Panchakm anu Jeevitha Rahashyam
Chapters
కులమత తత్త్వ వివేకము కులములు-జాతులు- వర్ణములు- మతములు. అవి లేవని కొందరందురు. గీతాశాస్త్రము, స్మృతులును అవి కలవనుచుండును. కులమనగా గుంపు సమూహము వర్గము సముదాయము సంఘము అని అర్థము గదా! మూలాధారాది సహస్రారము వఱకు గల షట్చక్రవర్తినియగు కుండలినీ శక్తి కి ''కుల''మనియు పేరుగలదు. ''సంఘం శరణం గచ్ఛ'' అను వాక్యభావమును గ్రహించుము. కులము లేనిచో ఆకులత ఏర్పడును. 1 వేదములను మధుకర వృత్తితో గాని, వారములతో గాని జీవయాత్రగడుపుచు గురుశుశ్రూషనుచేసి, చదువుకొని, మరచిపోకుండులాగున వల్లించుచు, మననమును చేయుచు, శాస్త్రముల చదివి ప్రవచనములు చేయుచు, వేద విధి విహిత సత్కర్మములను జేయుచు, తమ విద్య నభిలషించు విద్యార్థులకు విద్యాబోధ చేయుచు, అతిథి అభ్యాగతులను సత్కరింపుచు, చిత్త శుద్ధినిగడించి, జ్ఞానమును సముపార్జించిన వారు బ్రాహ్మణులు. ఈ సంఘమునకు బ్రాహ్మణ కుల మందురు. బ్రాహ్మణ దంపతులకు మాత్రమే జనించినవారు బ్రాహ్మణ జాతియందురు. సత్వగుణ సంపన్నులు బ్రాహ్మణ వర్ణమందురు. 2. దేశ సంరక్షణమును చేసి, ధర్మమును, సత్యమును, ప్రజల ధనధాన్యములను చోరులపాలు కాకుండునట్లు బాహుబలమున కాపాడెడివారు క్షత్రియులు. క్షత్రియ దంపతులకు జనించినవారు క్షత్రియజాతి యనంబడును. 3. గోసం రక్షణమును, కృషిని, న్యాయ వాణిజ్యమును చేయుచు, పండించిన పంటలను ప్రజలకు అందించువారు వైశ్యజాతి. వైశ్య దంపతులకు జనించినవారు వైశ్యసంఘము. 4 పైన కనుపఱచిన త్రైవర్ణికులకును వ్యవసాయమునందున, వ్యవహారమందును, వ్యాపారమందును, సహాయమొనర్చుచు సేవా ఫలమునందుకొను వర్గము శూద్ర (చతుర్ధజాతి) కులము, భగవద్గీతా శాస్త్రము నందును, స్మృతి స్మృతులందును ఇట్లు తెలుపబడెను. పై నాలుగు జాతులందును అనులోమ విలోమముగా జనించిన సంతానము మాదిగువలేక మాదిగ, మాల, డక్కల, పంబల అనబడుదురు దేశము అర్యావర్తము, భారతదేశము, హిందూదేశము అని పిలువబడుచున్నను, ఆంధ్ర, తమిళ, కేరళ హిందూస్థానీ, మరాటా, కన్నడ, బెంగాలీ, కాశ్మీరము, రాజపుత్ర, గుజరాతీ, మున్నగు పదునాలుగు భవనములవలె పదు నాలుగు భాషలు కలవు లిపి లేని భాషలు కొందరు అటవికులు లంబాడీ, ఎరుక, యానాది, పాకి, మున్నగు భాషలు కూడా మాటాడబడు చున్నవి. ఇక ఇతర దేశములలో ఈ భారత దేశములోవలె జాతులు, కులములు లేక ఒకేజాతిగా నుండెనని కొందరనుచుందురు. అది సరికాదు. మనుజుల రంగు. రూపము, ఒకటిగా నుండ వచ్చును ఆహారము ఒకటి నుండవచ్చును. ఆచారములు ఒకటిగా నుండనోవు. కాని భాషలు, లాటిన్, ఆంగ్లము, పారసీకము, అరబ్బీ, టర్కీ, జర్మనీ, జపాన్, ప్రాన్సు మున్నగు వేరువేరు భాషలు కలవు | 'ఓం' అనునక్షరమును చూచుచు, ఆలోచించుచు, అందలి శక్తిని పరిశీలింపుచు, వేదములు, ఉపనిషత్తులను, పఠించి అందలి సారమును గ్రహించి అధ్యాత్మతత్వ చింతనము గల మాక్స్ ముల్లం (మొక్షమూలర్) బెర్నార్డ్‌షా షేక్ స్పియర్ మున్నగు పండిత లోకము అచట బ్రాహ్మణ జాతివారు, 2 దేశ రక్షణము చేయుచు, పాలనా విధానమును సరిచూచుచుండు హౌస్‌ఆఫ్ లార్డ్స్, రాయల్ కుటుంబములవారు క్షత్రియ జాతివారు 3 సైకిల్సు, మోటారులు, ఇంజనులు, సిజర్సు, మెడిసిన్సు, వస్త్రములు, వానిని తయారు చేయు యంత్రములను కనిపెట్టి, చేయించి ఇతర దేశముల కెగుమతి చేయువర్తక సంఘము హౌస్‌ఆఫ్‌కామర్సు ఆ దేశములలోని వైశ్య సంఘమువారు 4 కార్మికులు, సమ్మెటపనులు, నేతపనులు, బొగ్గుగనుల పనులు, ఇతరగనుల పనులు, చేపలను పట్టి, ఆహారముగా నమ్మువారు, కుట్టుపని లేబర్ పార్టీవారు సేవచేయు శూద్ర జాతివారు. పాకీపని, చర్మకారులు పంచమజాతివారు. ఇట్లు జాతులు వర్ణవ్యవస్థలు హూణదేశమందును కలవు. మరియు ధనిక వర్గము, నిర్ధనులతోను, వర్తకులు, లార్డ్సుతోను, వివాహాది వియ్యములను స్వీకరింపరు, ఆ దేశమున కులములు లేనిచో 8వ ఎడ్వర్డును ''నీవు వర్తకుల బాలికను పరిణయమైన కారణమున, రాజుగా పనికిరావని రాయల్ కుటుంబమునకు పనికి రావని త్రోసివేసిరి'' అచట కులములు లేవనుటశుద్ధ పొరపాటుగా తలచుడు. పూర్ హౌస్‌లందు జీవించుచు నివసించువారు పంచమజాతి అనచెల్లును. అరేబియాలోని మహమ్మదీయ మతమున జనులు గడ్డములు (దాడీవాలాలు) శిరోజరహితులు, శెర్వాణి అంగీలు, వేషములోకే రీతిగనున్నను, 1. షేక్ 2. సయ్యద్ 3 మొగల్ 4 పఠాణీ అను చాతుర్వర్ణవ్యవస్థ కలదు. ఒక ముస్లిమ్ ప్రభువు తన కుమార్తె ప్రేమించి వివాహము చేసికొనిన నేరమున తండ్రియగు రాజు తమ మత విరుద్ధమైన వివాహము చేసికొనిన కుమార్తెను, అల్లుని, ప్రజలందరును చూచుచుండ తుపాకితో పేల్చి చంపెనని 1978 ఫిబ్రవరి పత్రికలో చదువరులు చదివి యుందురు. కాన వారి మతమున గల సిద్ధాంతములందు అట్టిగట్టి పట్టుదల వారికి కలదు. హూ దేశములో నున్న క్రైస్తవ మతములో నాలుగు విభేదములు కలవు. ఇంగ్లండు దేశమున వారి జాతికి జనించిన వారు 1 ఇంగ్లండు బాప్టిసిజమ్ అనియు, 2 అమెరికా దేశమున అమెరికన్ బాప్టిసిజమ్ అనియు, 3. ఇటలీ యందు రోమన్ కేథలిక్ మిషను అనియు, 4 హిందూదేశమున గల రెడ్డి, కమ్మ, తెలగ, వడ్డెర, మాల, మాదిగ, మున్నగు జాతుల వారిని తమ (సర్వేశ్వర) క్రైస్తవ మతములో చేర్చుకొనినను వారిని ఇండియన్ క్రిష్టియన్ అనియు, పేరులతో వారి క్రైస్తవ మతము చుతర్విధ మతవ్యవస్థలతో విరాజిల్లుచునేయున్నది. హిందూదేశమున మహీశూరపుర ప్రాంతమున కన్నడ రాజ్యమున శైవ మతము. బసవేశ్వర శైవాచార్యు లుద్భమించి మత వ్యాప్తి జేసి 1. బ్రాహ్మణశైవులు లింగధారులనియు, అది శైవులనియు, ఆ రాధ్యులనియు, 2. వైశ్య శైవులనియు, 3. శూద్ర శైవులను లింగాయతనియు, 4 జంగము దేవరలనియు, ఆ శైవమతములోను చతుర్విధ మత కుల వ్యవస్థలు కలవు. ఇంకను వీర శైవులు, వీరముష్టులు, లింగ బలిజ, మున్నగు శైవులు కలరు. తమిళ##దేశమును సహ్మాళ్వారు, పెరియాళ్వార్లు, మనదౌళమహాముని మున్నగు రామానుజాచార్య వైష్ణవ మత ప్రచారమున దేశము నందెల్లెడల 1. తెంగళ్ 2. పడగళ్ 3. పాంచరాత్రులు 4. విఘన సాచార్య శిష్యులు (నంబి=పెరియనంబీ) అనెడి చతుర్విధ మతకుల వ్యవస్థలును కలవు. ఇంకను మధ్య వైష్ణవులు, నియోగి వైష్ణవులు, ఆంధ్ర వైష్ణవులు బ్రాహ్మణులలోనూ- చాత్తాదు వైష్ణవులు సాతానులు, తేవ పెరుమాళ్ళయ్య చిన్నయ సూరి మున్నగు వారు గలరు. కావున హూణ దేశమునను క్రీస్తు, ముస్లిమ్ మతములలోను, భారతదేశమున శైవ వైష్ణవ సిద్ధాంతములందును చతుర్విధ వర్ణ సంస్థల, భగవంతుని సృష్టియందు 1 జరాయు జములు (మనుజులు, పశువులు) 2 అండజములు (పక్షులు పాము, బల్లులు, చేపలు, తాబేళ్ళు) 3 స్వేదజములు (నల్లులు, దోమలు, ఈగలు, మిన్నల్లులు, గోమారులు,) 4 ఉద్భిజ్యములు (చెట్లు, తీగెలు, పైరులు, పచ్చిక) అను చతుర్విధ జాతులు గల జీవరాసులు వలెనే కలవని గోచరించును. కాన లేదని వచించుటకు వీలు కానరాదు. ఇక మన దేశ##మేమి? భూమండలములోని, రాజకీయ మార్గములలో నడి చెడి వారును జాతి, మత, కుల, వ్యవస్థలు లేవనుచు పైకి నోట వచించుటయే గాని, లోతుగా, విమర్శించి, ఆలోచించి చూచినచో ఉన్న వనియే రుజువగును సుమా! 1. కాంగ్రెస్ వారిలో మహ్మదీయులు గానీ, క్రైస్తవులు గాని, బౌద్ధులు గాని, జైనులు గాని హిందువులు గాని యుండవచ్చును గాంధి, క్రీస్తు, ఇతరులు చెంపపై కొట్టినచో తిరుగబడక, రెండవ చెంపపై కొట్టుమని కను పఱచుము ఓర్పు=సహనము క్షమ=శాంతము, ముఖ్యమనియు, నొకవేళ శత్రువులు తుపాకితో కాల్చినను, చచ్చుటను నేర్చుకొనుమనియు, చాపగా మిగిలిన వారలే సుఖము ననుభవింతురనియు, బోధించెను. ఇది సత్త్వ గుణము, శాంతగుణము గలవారు మాత్రమే నిజమైన కాంగ్రెసువారు అని రాజకీయ నాయకమణుల భావము. ఈ సాత్విక జాతియే బ్రాహ్మణులని ఎరుంగుము. 2. కమ్యూనిస్టు నాయకులు ధనిక వర్గమును, పెట్టుబడి దారుల వర్గమును, చంపి వారి ధన ద్రవ్య సంపదలను కొల్లగొని, పేద సాదలకు పంచిపెట్టు మనెడివారు. రైటిస్టు, లెప్టిస్టు, మార్కిస్టు, మున్నగు వారి ప్రబోధమంతయు క్షాత్ర వృత్తికలది. కాన వారే క్షత్రియ జాతి వారని ఎరుంగుడు. 3 లారీ ఖర్చులు, ఎగుమతి చార్జీలు, లాభములు, వడ్డీలు, ఇంటి అద్దెలు, గుమస్తా జీతములు, తరుగులు, నష్టములను మున్నగు సొమ్మును ప్రజల నుంచి వసూలు చేయుచు, సంఘీభావముతో మెలంగువారు వైశ్యజాతియని తలచుము వీరు సోషలిస్టులని భావము. 4 లేబర్ పార్టీ కార్మిక వర్గము శూద్రజాతియని భావము. 5. షెడ్యూల్డు, వెనుకబడిన తరగతుల వారు పంచముల-మాల-మాదిగ-డక్కలవారు. వీరిని హరిజనులను చుందురు. ఏ రాజ్యాంగములు ఎన్నియో మార్పులు చెందినవి. హిందూ, మొగలు, హూణ, దేశ చక్రవర్తులు పాలించిరి. ఏ ప్రభుత్వములోను, ఏ ధర్మశాస్త్రములలోను లేని క్రొత్త మార్పులు చెందుచున్నవి. ఇతర దేశములలో నీగ్రోవారు నలుపు రెడ్ ఇండియనులు ఎరువు. హూణులు తెలుపు చీవావారు పసుపు. ఆ రంగులతో పాటు ఒకే కులము; ఒకే మతముగా అచట వ్యవహరింపబడు చున్నవి. మన హిందూ దేశమున, ఈ నాలుగు జాతులు, అయిదవ జాతిగానుండు దుస్థితి, దౌర్భాగ్యము, దారిద్య్రము ఏల? భగవద్గీతలో నాలుగు వర్ణములుండగా పంచమవర్ణ మెచటినుంచి వచ్చినది? అను వారెందరో కలరు. ఇది ఎంతగా జాతీయ భావోపేతులు బాధనొందుచు ప్రచారము చేసినను, హుణులవలె నొకే జాతిగను, ఒకే అచారముగను చేయతలంచినను ఇది మానవులకును, రాజ్యాంగవేత్తలకును, సాధ్యము కాని పని. అంతియగాక దైవమునకు గూడ సాధ్యము కాని కార్యము ఈ జాతులన్నియు సృష్టి ఆదినుండి అంతమువఱకును సూర్యచంద్ర నక్షత్రములు, సాగరములు, సప్తగిరులు, జీవనదులు, వృక్షములు, పంచ ప్రాణములు, పంచభూతములు, జగమున నున్నంత కాలము మార్పునొందక నిలిచియుండునవియే. కులాంతర మతాంతర వివాహములు, భోజనములు చేసినను మారవు అని ముఖ్యంగా గుర్తింపతగి యున్నది. ఎవరును మార్చలేరు. బాక్‌వర్డు-షెడ్యూల్డు హరిజనులు అను నామములు క్రొత్తగా వచ్చి చేరినను, పై జాతి నిర్ణయములు మార్పు నొందునవి గావు. మాదిగ, మాల, డక్కల జాతులను ఎవరు ఏ మతములో చేర్చినను, వారి వారి ఆచార వ్యవహారములను మానుకొనజాలరు. మాలవారు మాదిగవారి బావిలోని నీరు తోడరు. మాదిగలు మాల వారి నూతినీరు తోడరు. ముట్టరు. త్రాగరు. డక్కలవారు వారి గూడెమునకు దూరముగనుండి పిలిచి బిచ్చమునెత్తుకొందురే కాని ఇంటికడకును, గూడెములోనికి రానీయరు. నేటివరకు జరుగనున్న ఆచారమిది. ధన, గృహ, భూ, విద్యా, ఉద్యోగ, ఆశలను జూపినను, ఎవరివాడలు వారివిగనే యున్నవి. ఎవరిబావులు వారివిగనే యున్నవి. చదలువాడ, చిరువాడ, చెఱుకువాడ, మరువాడ, మాదివాడ, బూదవాడ, గుడివాడ, విజయవాడ, మఱ్ఱివాడ, మఠ్ఠెవాడ, నందివాడ, మున్నగు గ్రామములవలె మాలవాడ, మాదిగవాడ హరిజనవాడలు వేరుగానున్నవి కాలభేదముచే, మాల, మాదిగవారు అది ఆంధ్రులనియు, హరిజనులనియు, ఆది ద్రావిడులని పిలువబడిరి. మాదిగ గూడెము, మాలగూడెము, గొల్లగూడెము, వడ్డెరగూడెము, ఉప్పరగూడెము, చంద్రగూడెము, చిలుకూరివారిగూడెము, క్రొత్తగూడెము, బ్రాహ్మణగూడెము, వేరుగానున్నవి. కారాగృహవాసులకు, ఆహారము, వస్త్రము, వసతీ, ఆరోగ్యము, వైద్యము మున్నగు సదుపాయములు చేసినట్లు ప్రజలందరికిని ప్రభుత్వమే కల్పించి వారివారి కర్ధమగు పనులను కల్పించి పాలింపగూడదా? అప్పుడోకేజాతి, ఆభావముగా, మారును. కాని పనులలో బేధముందవచ్చును. కాన అపుడును సమానులుగారు గదా! అపుడెందరు వంటవారు, భోజనపాత్రల నెత్తువారు వడ్డన చేయువారలు కావలసియుందురో! ఇది ఎవరివలనను కాని పని, ఎవరును చేయలేనిపని. పూర్వము దేశమునేలిన ప్రభువులును. ముస్లిము చక్రవర్తులును, పేద ప్రజలకు మాత్రము రొట్టెలను, ఇచ్చుటే కాక డబ్బును, బంగారమును రత్నములను పొట్లములను గట్టి ధనమును, ఆహారమును ఇచ్చెడి వారు. వారే సర్వులకును ఈయలేక పోయిరి. హూణులు తమ దేశములో పూర్ హౌసులను నిర్మించి, పేద వారలకు వసతులను కల్పించిరి దిక్కు లేని వారలను పోషించిరి. హిందూ రాజులును, అగ్రహారములను, ఇనాములను, గృహములను, సత్రవులను అన్నసత్రపులను నిర్మించి పోషింరి. అట్టి పనులను ఇప్పటి సుఖ శాంతిలోక కల్యాణమును గోరువారును, రాజకీయవేత్తలు ఏ మాత్రము కల్పించి పాలింపజాలరనుట నిక్కువము. వశిష్ఠమహర్షి విశ్వామిత్ర మహారాజునకు వేటకు వచ్చిన సమయమున వారి సేవలకును, హస్త్యశ్వపదాతులకు భోజన వసతులేర్పరచి సత్కరించెనని రామాయణ గాధ తెలుపును. వాల్మీకి సీతనుకొనివచ్చి పురుడుపోసిపుష్కర కాలము పిల్లలు పెద్దలగు వరకు కుశలవులను పోషించెను. వాల్మీకి శిష్యుడు భరద్వాజుడును ఇట్లే భరత చక్రవర్తి రామునికై పోవుచుండ వారి సిబ్బందికి ఏనుగులకును, గుఱ్ఱములకును, సేవలకును, మంత్రులకును, రాజకుమారుడగు భరతునకు వారివారికి తగిన ఆహారము నొసంగి గౌరవించెను. వారు మహర్షులు. తసస్సంపన్నులు, వారికడ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, కల్పలత, మున్నగు తపశ్శక్తిచే నార్జించిన వస్తువులు, విద్యలు, కలవు. ఇప్పుడట్టి విలుప్తమైనవి. అందుకు విచారింపవలసియున్నది. పూర్వము జ్ఞాన, తపోధన, థ్యాన నిష్టోద్యోగ, ధారణాకృషి, సమాధిసుఖశాంతివంతులై యుండెడివారు. బ్రాహ్మణజాతి. ఆజాతిని ప్రభువులు వసతుల గల్పించి పోషించెడివారు ప్రస్తుతము. 1 సుజ్ఞాన ధనహీన జాతియు, 2తపోధనహీనజాతియు, 3యోగధనహీజాతియు, 4 శక్తిధనహీనజాతియు, 5 స్వస్వరూపధ్యాన ధనహీన జాతియు, 6 సచ్చిదానంద ధారణోద్యోగ హీనజాతియు, 7 బ్రహ్మానుదానుభవ సుఖ హీనజాతియు, అయియున్నది. బ్రాహ్మణజాతి. కాలమహిమచే కలి పురుషుడెంతబాధించినను, భవిష్యత్తుని శ బల (నగరము గ్రామమున) విష్ణుయశున కాత్మజుడై కల్కియను, మహాపురుషు డుద్భవించి, దేశమును సుభిక్షము నొనరించి కాలుమునకై మనమెదురు చూచుచుందుముగాక. ఇతిశినమ్ సర్వేణాంశాంతిర్భవతు. హంః ఓం. తత్. సత్.